‘సర్’కు మరో వారం రోజులే గడువు

74.38 శాతం డిజిటలైజేషన్ పూర్తి

జిల్లాల్లో 80 శాతం పైనే ఫారాల సమర్పణ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 60 శాతం లోపే డిజిటలైజేషన్

రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల నుంచి సుమారు కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశం

ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..సర్) గడువు మరో వారం రోజులే మిగిలింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. సర్ ప్రక్రి య జిల్లాల్లో మెరుగ్గా కనిపిస్తుండగా, హై దరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయం త్రం వరకు 2,51,61,783 (74.38 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన ట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.

చాలా జిల్లాలో 80 శాతానికి పైగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్‌లో 51.85 శాతం, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లాలో 56.27 శాతం, రంగారెడ్డి జిల్లాలో 59.98 శాతం పూర్తయ్యింది. అధికారులు సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సర్ విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే, సర్ గడువు మరో వారం రోజులే ఉండటంలో నిర్ధేశిత సమయంలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తమవుతుందా.. లేదా..? అనే సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మొత్తం ఓటర్లలో 50 లక్షల నుంచి కోటి వరకు ఓ ట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డబు ల్ ఓట్లను తొలగించడం, మరణించిన వారి ని ఓట్లు తొలగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అర్హులైన వారి ఓట్లు తొలగిస్తారనే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రలో సర్ ప్రక్రియలో భాగంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు తొలగిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియలో ప్రతి ఓటరు ఓటు తమ ఓటును కాపాడుకోవాలం టే ఎన్యూమరేషన్ ఫారం అత్యంత కీలకం. ఓ టరు జాబితాలో ఉన్న చిరుమానా ఆధారంగానే బిఎల్‌ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే, ఇళ్లు మారిన వాళ్లు, వలస కార్మికులు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు వారు తమ ఓటును బదిలీ చేసుకోకపోతే పాత చిరుమానాలో వారికి ఓటు ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న చిరుమానాలో వారికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వరు. పాత చిరునామాలో వారు అందుబాటులో లేకపోతే బిఎల్‌ఒలు షిఫ్ట్ రాస్తున్నారు. వారు ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇవ్వలేరు కాబట్టి, ముసాయిదా జాబితాలో వారి పేరు ఉండదు. అలాంటి వారు తర్వాత కొత్త ఓటరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

సొంతూరిలో ఓటు ఉంచుకునేందుకే మొగ్గు

చాలామంది ఓటర్లు తమ సొంతూళ్లలోనే ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. సొంతూరిలో ఓటు లేకపోతే విలువ ఉండదు అని భావిస్తున్న ఓటర్లు అక్కడే తమ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పిస్తున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ నగరంతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ స్వగ్రామంలోనే ఓటు కోసం ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇస్తున్నారు. అయితే, అందులో కొంతమంది హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో కూడా ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబుల్ ఓట్లు ఉండేందుకు అవకాశం లేకపోవడంతో గ్రేటర్‌లో లక్షల్లో ఓట్లు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆగస్టు 10న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 3 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24తో గడువు ముగియాల్సిన ఉండగా, పలు రాజకీయ పార్టీలు, సంఘాల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 3 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గడువు పొడిగించింది. ఆగస్టు 10వ తేదీన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 12వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.