
ఈరోజుల్లో చాలమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీర బరువు నియంత్రణలో లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రధానంగా, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే, దాని తగ్గించడం చాలా కష్టం అవుతుంది. అయితే, ఇంటి దగ్గరే తయారు చేసుకునే కొన్ని హెల్తీ డ్రింక్స్ కొవ్వును సులభంగా తగ్గిస్తాయి. వీటిని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, జీవక్రియను గణనీయంగా పెంచుతాయి. అంతేకాకుండా, ఈ పానీయాలు కేలరీలను సులభంగా కరిగిస్తాయి. శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. ఈ పానీయాలను సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ తీసుకుంటే కేవలం ఒక నెలలోనే 4 నుండి 5 కిలోగ్రాముల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి బరువు తగ్గించే పానీయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గోరువెచ్చని నిమ్మరసం
సులభంగా బరువు తగ్గాలనుకుంటే గోరువెచ్చని నిమ్మరసం ఉత్తమమైన ఎంపిక! ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేస్తాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసంతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను పెంచుతుంది.
గ్రీన్ టీ
అదనపు బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ టీ ఒక ప్రసిద్ధ ఎంపిక. గ్రీన్ టీలో చాలా తక్కువ మోతాదులో కెఫిన్, కాటెచిన్లు ఉంటాయి. ఈ రెండూ కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగితే, పొట్టలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. గ్రీన్ టీ తాగడం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. శరీర శక్తి స్థాయిలను సైతం మెరుగుపరుస్తుంది. అల్పాహారం తర్వాత లేదా జిమ్‌కు వెళ్లే ముందు దీనిని తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చియా సీడ్ వాటర్
చియా గింజలు కూడా ఈ ఆరోగ్యకరమైన కోవలోకి వస్తాయి. ఇవి ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను సమృద్ధిగా అందిస్తాయి. నానబెట్టిన చిత్ సీడ్స్ వాటర్ తీసుకుంటే కడుపు ఎక్కువ సేపు నిండిన భావన కలుగుతుంది. పైగా పదే పదే తినే అలవాటును నివారించవచ్చు. వీటిని తీసుకోవడానికి రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ చియా గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయన్నే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ పానీయం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం బరువు తగ్గడానికి గణనీయంగా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగాలి. అయితే, దీనిని ఎప్పుడూ నేరుగా తాగకూడదు. అలా చేయడం వల్ల దంతాలకు, కడుపుకు తీవ్రమైన హాని కలుగుతుంది.












