మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ బోగాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన (శనివారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. శనివారం ఉదయం10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కుంటారు. ఉదయం 10:45-10:50 గంటలకు ప్రధాని మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఎపి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎపి సిఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10:5010:55 గంటలకు కారులో ప్రయాణి కుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. 10:5510:58: 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు.

11, 11.15 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. 11.17 - 11.25 గంటలకు టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 11:3012:55 గంటలకు విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:051:10: భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు.