
ఛండీగఢ్: ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో భార్య విడాకులు కోరడంతో భర్త మనస్థాపంతో ఉరేసుకున్నాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరత్ నగర్‌లో సంజీవ్ యాదవ్, మనప్రీత్ కౌర్ అనే దంపతులు నివసిస్తున్నారు. కొంతకాలం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో భర్తకు విడాకులు ఇస్తానని భార్య తెగేసి చెప్పడంతో అతడు ఇంట్లోనే ఉరేసుకుంటుండగా కుమారుడు వీడియో తీశాడు. అదే సమయంలో తన భర్తను కాపాడాలని కేకలు వేసింది. అప్పటికే భర్త ఉరేసుకొని చనిపోయాడు. సంజీవ్ తండ్రి ఫిర్యాదు మేరకు మన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.








