
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారకం అమర జ్యోతి వద్ద ప్రజా కవి అందె శ్రీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , మోతె శోభన్ రెడ్డి, కవులు కళాకారులతో కలిసి నివాళులు అర్పించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు ,రచయితలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించడానికి కళాకారుల సలహాలు సూచనలు అభిప్రాయాలు రికార్డు చేశామని పొన్నం తెలియజేశారు. "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ (అందె ఎల్లయ్య) జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ఘన నివాళులర్పించారు. పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.








