హైదరాబాద్:  ప్రతి నీటి చుక్క సంరక్షించుకోవాలి - పర్యావరణాన్ని కాపాడాలనే నినాదం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ తో పాటు మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని ప్రతిజ్ఞా చేయించారు. వర్షపు నీటి సంరక్షణ లో భాగంగా సైఫాబాద్ సైన్స్ కాలేజీ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజక్షన్ పాయింట్ , రెయిన్ వాటర్ ఫిట్స్, హార్వెస్టింగ్ బోర్ వెల్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వాటర్ వర్క్ ఎండీ అశోక్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.