
అమరావతి: కుటుంబంలో గొడవలు చెలరేగడంతో భార్యను భర్త గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగింది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.... భవానీ పేటలో మురళీ(45), మంగం లక్ష్మి(40) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు, కూమారులు, కూతురు ఉంది. కూతురుకు పెళ్లి చేయగా కుమారులతో కలిసి ఉంటున్నారు. ఒక అర ఎకరం భూమి ఉండడంతో అమ్మేసి ఇల్లు కొనుగోలు చేద్దామని మురళీతో భార్య లక్ష్మి తరచూ చెబుతూ ఉండేది. భూమి విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం లక్ష్మి చర్చికి వెళ్లి ఇంటికి వచ్చింది. మరోసారి భూమి విషయంలో భర్తతో భార్య గొడవకు దిగింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను నెట్టేశాడు. కిందపడిపోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతు కోశాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో స్థానికులు అక్కడికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ చూసి షాక్ గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











