గాజువాక: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలోని పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫొటోషూట్‌ కోసం బీచ్‌కు వెళ్లిన స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జాలరిపేటకు చెందిన నీతూతో పాటు మరో ఐదుగురు స్నేహితులు ఆదివారం పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీతూ, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై న్యూ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.