
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా ‘కలర్ ఫొటో‘, ‘బేబి‘ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలకానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం నాలుగు, ఐదు మంచి హిట్స్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతాడు”అని అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాతో రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకు ఎంతో ప్రత్యేకం. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి”అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- “ఈ సినిమా సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట్లాడుకోరు. కొత్త దర్శకుడైన నన్ను కిరణ్ అన్న నమ్మి సినిమా చేశారు”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ హానెస్ట్ లవ్ స్టోరీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ యెర్నేని, రవిశంకర్, సాయి రాజేష్, మణిశర్మ, శివ నిర్వాణ, శ్రీ గౌరి ప్రియ, నరేష్, త్రిగుణ్, మహేందర్, పూజ, సిరి హన్మంతు, అనంత్ శ్రీరామ్, నవీన్, డేనియల్ విశ్వాస్ పాల్గొన్నారు.











