హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే పేరు ఎత్తగానే టెస్టు క్రికెట్ గుర్తుకు వస్తుంది. టెస్టు క్రికెట్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌కు రహానే గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రహానే మూడు ఫార్మాట్‌లలో ఆడాడు. కానీ టెస్టు క్రికెట్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు సృష్టించాడు. ఎన్నో టెస్టులు ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్‌లో మార్మోగుతుంది. వైభవ్ మైదానంలో అడుగు పెట్టాడంటే చాలు రికార్డులు బద్ధలవుతున్నాయి. అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టడంతో పాటు అతి తక్కువ వయసులో హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. కానీ వైభవ్ ఒక్క రికార్డు మాత్రం బద్దలు కొట్టలేడు. టి20 అంతర్జాతీయ ఆరంగ్రేట్ మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా రహానే రికార్డు సృష్టించాడు. తొలి 20 మ్యాచ్‌లో రహానే 61 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరు బద్దలు కొట్టలేదు. వైభవ్ అరంగ్రేటం మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ రికార్డును వైభవ్ కూడా బద్దలు కొట్టే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో సూర్యవంశీ ఎన్ని సెంచరీలు చేసిన ఈ రికార్డు రహానేకు సొంతం అవుతోంది. 20 టి20 మ్యాచ్ లు ఆడి 375 పరుగులు చేశాడు. 90 వన్డే మ్యాచ్ లలో 2962 పరుగులు, 85 టెస్టు  మ్యాచ్ లలో 5077 పరుగులు చేశాడు. టెస్టులలో 12 సెంచరీలు, వన్డేలలో మూడు సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో 18 సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు.