హైదరాబాద్: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. కారు ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైకును కారు ఢీకొట్టిన ఘటనలో గుండేటి శ్రీను(18), రిషిక(10) ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.