ధర్మశాల: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. 66 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఒక విషయంలో మాత్రం గిల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. రోహిత్ బంతిని కొట్టి స్ట్రైకింగ్ ఎండ్ నుంచి పరిగెత్తాడు.. కానీ, గిల్ మాత్రం నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి కదలలేదు. దీంతో రోహిత్ ఔట్ కాక తప్పలేదు. దీంతో రోహిత్ అభిమానులు గిల్‌పై మండిపడుతున్నారు.

అయితే మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తనపై ఆగ్రహంతో లేడని అన్నాడు. రోహిత్ రనౌట్ కావడం దురదృష్టకరం. ఆ సమయంలో చాలా నిరాశకు గురయ్యాడు. అయితే డగౌట్‌కి వెళ్లాక రిప్లే చూసి ఓకే పర్వాలేదులే అని నాతో అన్నాడు. గతంలోనూ అఫ్గాన్‌తో టి-20 ఆడినప్పుడు కూడా ఇలానే రోహిత్ రనౌట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కావడం నిజంగా అన్‌లక్కీనే.