రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టి ఎగవేతకు సంబంధించిన కేసులో ఎకోరిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్నను జిఎస్‌టి అధికారులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంలో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అరెస్టు జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం, సదరు కంపెనీ రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టిని ఎగవేసిందని అధికారులు అనుమానిస్తున్నారు.

నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, టర్నోవర్‌ను తారుమారు చేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ పన్ను మోసానికి లక్ష్మీ ప్రసన్నే ప్రధాన బాధ్యురాలని నిర్ధారించుకున్న అధికారులు ఆమెను అరెస్టు చేసి, తదుపరి విచారణను ప్రారంభించారు. ఇతర వ్యక్తుల పాత్ర, ఇతర సంస్థలతో కంపెనీ జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతోంది.