
హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై ఎక్స్ (ట్విట్టర్)లో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపిఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో గుర్తుతెలియని వ్యక్తి దూషించాడు. అభ్యంతరకర పోస్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తీవ్రంగా పరిగణించారు. సదరు నెటిజన్‌పై ఐటి చట్టం, ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు.











