
మనతెలంగాణ / సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 15మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లో పనిచేస్తున్న బలరాం నుంచి ఉమెన్ అండ్ సిఎస్‌డబ్లూకు, గిరీష్ కుమార్ కూకట్‌పల్లి నుంచి మాదాపూర్ పిఎస్‌కు, శ్వేతను మాదాపూర్ నుంచి బాలానగర్‌కు, ఈఓడబ్లూలో పనిచేస్తున్న కృష్ణను మేడ్చల్ పిఎస్‌కు, వినోద్‌కుమార్‌ను ఈఓడబ్లూకు, రాయదుర్గంలో పనిచేస్తున్న ప్రణయ్‌తేజ్ రెడ్డిని కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.








