ఎలన్, శాన్వీ మేఘ న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యా ణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనిధి సాగర్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చెప్పే ప్రయత్నం చేశామని తెలిపారు. హీరో, డైరెక్టర్ ఎలన్ మాట్లాడుతూ “నేను తెలుగు సినిమా చేయాలన్న కల ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’తో నిజమవుతోంది. 32 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం”అని అన్నారు. ఈ కార్యక్ర మంలో హీరోయిన్ శాన్వీ మేఘన పాల్గొన్నారు.