
హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నామాజీ సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో 22ఎ పై పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని, ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని సూచించారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారని, గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తలకిందులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ ను నమ్మరని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఇస్తామని వెయ్యి రోజుల్లో కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.













