
హైదరాబాద్: సినీనటి పావలా శ్యామల (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. గుండెపోటుతో మృతి చెందాన ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆమెకు ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సాయి దుర్గాతేజ్, దిల్ రాజు వంటి సినీ ప్రముఖలు ఆర్థిక సాయం చేశారు. 1951లో ఎపిలోని గుంటూరు జిల్లాలోని జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తరువాత నేతి శ్యామల పేరు పావలా శ్యామలాగా మారిపోయింది. నాటక రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆంధ్రావాలా, స్వర్ణకమలం, బాబాయ్ అబ్బాయ్, ఖడ్గం వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.











