
రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పా ల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ విజ్ఞప్తి చేశారు.సర్ ను లైట్ తీసుకుంటే... మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘సర్” ఫాంను నింపి చైతన్యపురిలోని సాధన స్కూల్ లో ఉన్న బీఎల్ వో అధికారుల వద్దకు వెళ్లి స మర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఎవరూ లైట్ తీసుకోవ ద్దని కోరారు. ‘మీ ఓటును కాపాడుకోండి... మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి” అని పిలుపునిచ్చారు. అక్కడే ఆన్ లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సర్ ప్రక్రియలో పాల్గొలని కోరారు. ఈనెల 24 వరకు సమయం ఉందని నిర్లక్ష్యం చేయకం డి! చివరి రోజు కోసం ఎదురుచూడవద్దన్నారు. ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారమ్ నింపండి... మీ ఓటును కాపాడుకోండి. అట్లాగాకుండా ‘నా దగ్గర ఓటర్ ఐడీ ఉంది... నాకు ఏమవుతుం దిలే” అని ఇంట్లో కూర్చుంటే... రేపు ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత “లిస్టు లో మీ పేరు గల్లంతవుతుంది. అందుకే చేతిలో ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు... ఓటరు జాబితాలో పేరు ఉండాలి. అందులో భాగంగా బీఎల్‌ఓ మీ ఇంటికి వస్తే సహకరించాలని కోరారు.
తెలంగాణ యువతను కోరుతున్నా...
ముఖ్యంగా తెలంగాణ యువతను కోరుతున్నా... మీ ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడి యా చూస్తారు.. రాజకీయాలపై పోస్టులు పెడతారు, ప్రభుత్వాలను తిడతారు,నాయకులను ప్రశ్నిస్తారు, కానీ మీ ఓటు లిస్టులో ఉందో లేదో ఒక్కసారైనా చూసుకున్నారా? ఓటే లేకపో తే... మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది? మీ ఇంట్లో అమ్మ ఓటు చూడండి.. నాన్న ఓ టు చూడండి, కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయో లేదో చూడాలని యువతను కోరారు. ఎందుకంటే ఓటు అంటే కాగితం ముక్క కాదు, ఓటు అంటే ప్రజల చేతిలో ఉన్న అధికారం అని ఓటు అంటే ప్రశ్నించే హక్కుకు బలం అని, ఐదేళ్లు నాయకులు ప్రజల దగ్గరకు రాకపోయి నా, ఎన్నికల రోజు మాత్రం ప్రజల దగ్గరకు రావాల్సిందే అన్నారు. ఎందుకు? మీ చేతిలో ఓ టు ఉంది కాబట్టి.. అలాంటి ఓటును నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటారా? ఆలోచించాలని కోరు తున్నా అన్నారు. ఎవరో చూస్తారులే... బిఎల్‌వో చూసుకుంటారులే... పార్టీ వాళ్లు చూసుకుం టారులే... అని వదిలేయొద్దు!
మీ ఓటు బాధ్యత మీదే! ముఖ్యంగా ప్రతి యువకుడు నా కు టుంబంలో ఒక్క ఓటు కూడా పోనివ్వను” అని సంకల్పంతో పని చేయలన్నారు. సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు... ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం కాదని పేర్కొన్నారు. ఈ రోజు సర్ ఫారమ్‌ను నిర్లక్ష్యం చేస్తే రేపు పోలింగ్ బూత్ దగ్గర పశ్చాత్తాపప డే పరిస్థితి రావచ్చు! మీ ఓటును కాపాడుకోండి...ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండన్నా రు. ముఖ్యంగా కొన్ని చోట్ల సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంద న్నారు. మజ్లిస్ తో కుమ్కక్కై కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చే స్తోందన్నారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదముందన్నా రు. తెలంగాణలోని హిందువులంతా జాగ్రుతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిం దువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఓటు హక్కును నిర్లక్ష్యంతో కోల్పోవద్దు
ఈ రోజు ఎన్యుమరేషన్ ఫారమ్ నింపడానికి పది నిమిషాలు కేటాయించకపోతే... రేపు ఎన్ని కల రోజు “నా ఓటు ఎక్కడ?” అని బాధపడాల్సి వస్తుందన్నారు. అప్పుడు అధికారులను నిం దించినా,వ్యవస్థను ప్రశ్నించినా కాలం వెనక్కి రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఓటు పోతే... మీ గొంతు బలహీనపడుతుందన్నారు. మీ ఓటు ఉంటే...మీ ప్రశ్నకు బలం ఉంటుంద న్నారు. ప్రజాస్వామ్యంలో నాయకుడి కంటే గొప్పవాడు ఓటర్. ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణ యించేది ఓటర్ అన్నారు.రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్మించేది ఓటర్ అన్నారు.అలాంటి అమూ ల్యమైన ఓటు హక్కును నిర్లక్ష్యంతో కోల్పోవద్దన్నారు.అంతకు ముందు సర్ ప్రక్రియ ఎలా కొ నుసాగుతోంది?ఎన్యుమరేషన్ దరఖాస్తులను అంద రికీ పంపిణీ చేశారా? ఎంత మంది ఎ న్యుమరేషన్ దరఖాస్తులను నింపి అందజేశారు? ఈ వి షయంలో ఓటర్లు పడుతున్న ఇబ్బం దులేమిటి? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల24లోపు ఎన్యుమరేషన్ దరఖా స్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫాంలను అందజేశారని అధికారులు వివరించారు.













