
ధర్మశాల: కొద్ది రోజుల క్రితం అఫ్గాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు జట్లు వన్డే సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కావాలని తొలి వన్డే మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా కనీసం టాస్ వేసేందుకు కూడా అవకాశం రాలేదు. ఎట్టకేలకు వరుణుడు శాంతించడంతో టాస్ వేశారు. ఇందులో టాస్ గెలిచన భారత్ బౌలింగ్‌ని ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ని 25 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులోకి ఇద్దరు అరంగేట్రం చేస్తున్నారు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తమ తొలి వన్డే ఆడనున్నారు.
తుది జట్ల వివరాలు:
అఫ్గాన్: ఇబ్రహీం జార్దన్, రెహ్మనుల్లా గుర్బాజ్ (కీపర్), సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, AM గజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.
భారత్: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రశిద్ధ్ కృష్ణ.











