చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయి

మన చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు

జీవంతో నిండిన భవిష్యత్‌ను హైడ్రా అంకితం చేస్తోంది

సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్‌ను చూడడం తనకు ఎంతో తృప్తిని ఇస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ (ఎక్స్) వేదికగా పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్‌ను హైడ్రా అంకితం చేస్తోందని ఆయన అన్నారు.

ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవనానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి సిఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదని భావి తరాలకు భవిష్యత్‌ను భద్రపరచడమని ఆయన తెలిపారు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.