
శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కోసం జట్టుతో జత కట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. అందులో ఈ సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కొద్ది రోజుల క్రితం అతడు ఫిట్‌నెస్ సాధించాడని బిసిసిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజాగా తెలుస్తోంది.
బుమ్రా మోకాలి వాపు మొదట్లో కనిపించిన దానికంటే తీవ్రంగా ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో టీం ఇండియా షెడ్యూల్ వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఈ మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించాలంటే బుమ్రా కీలకం. దీంతో ఇప్పుడు రిస్క్ వద్దని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోని స్పోర్ట్స్ సైన్స్ బృందం సూచించినట్లు తెలుస్తోంది. లంకతో టెస్ట్ సిరీస్ నాటికి బుమ్రా ఫిట్‌నెస్ సాధించినా.. నేరుగా టెస్టు మ్యాచ్‌లు ఆడించడానికి బిసిసిఐ మెడికల్ టీం సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం.











