
శ్రీలంకతో త్వరలో భారత్ టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కి ముందు భారత్‌కి షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాడని భావించిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు ఈ సిరీస్‌కి దూరమ్యాడు. దీంతో భారత జట్టు బౌలింగ్ విభాగంలో లోటు ఏర్పడింది. అయితే బుమ్రా స్థానంలో జమ్మెుకశ్మీర్‌కి చెందిన అకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బిసిసిఐ సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. 29 ఏళ్ల నబీ చాన్నాళ్ల నుంచి భారత జట్టులో ఆరంగేట్రం చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది.
అసలు గత రంజీ ట్రోఫీని జమ్ముకశ్మీర్ నెగ్గడంలో అకిబ్ నబీదే కీలక పాత్ర. ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో అతడికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులోనే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ, అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కి ఎంపికైన నబీని తుది జట్టులో ఆడించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.











