బాల్కొండ: నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ఈతకు దిగి నలుగురు యువకులు మృతి చెందారు. ముప్కాల్ వద్ద ఎస్సారెస్పి బ్యాక్ వాటర్‌లో ఈతకు దిగిన ఐదురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన నలుగురు చనిపోయారు. మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు నిజామాబాద్‌కు చెందిన వారుగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.