ఆసిఫాబాద్: చాయ్ తాగేందుకు 20 రూపాయలు ఇవ్వలేదని వృద్ధుడిని గొడ్డలితో నరికి తల, మొండెం వేరు చేసిన సంఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పర్సనంబాల గ్రామానికి చెందని మసాడి సోమయ్య(65) అనే వ్యక్తి భార్య తానుబాయితో కలిసి నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కూతురు లక్ష్మి కూడా అక్కడికి రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పెద్ద కూతురు లక్ష్మిని హైదరాబాద్‌కు వెళ్లేందుకు రెబ్బెన రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

ట్రైన్ ఆలస్యం కావడంతో స్టేషన్ ముందు టీతాగుతూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్ అనే వ్యక్తి సోమయ్య గొడ్డలితో వెంబడించాడు. కొంచెం దూరం వెళ్లిన టీ తాగడానికి 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సోమయ్యను వెంబడించాడు. అనంతరం గొడ్డలి తీసుకొని సోమయ్య మెడపై నగేష్ వేటు వేశాడు. తల, మొండెం వేరు చేసి అక్కడి నుంచి నగేష్ పారిపోయాడు. డిఎస్‌పి అశోక్, రెబ్బెన సిఐ సంజయ్, ఎస్‌ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తానుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్సనంబాల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.