
తొలి టి20లో జింబాబ్వేపై గెలుపు
హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 13.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు.
ఇషాన్ కిషన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 24 బంతుల్లలో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ జింబాబ్వేను కట్టడి చేశారు. రియాన్ బుర్ల్ (26), వెస్లీ మధెవర్ (39), మరుమాని 27 (ణాటౌట్), బెన్ కరన్ (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చాడు. అంతేగాక రెండు వికెట్లను కూడా పడగొట్టాడు. రవి బిష్ణోయ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మయాంక్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.











