
మూడో టి20లోనూ జింబాబ్వే చిత్తు
3-0తో సిరీస్ కైవసం
హరారే: భారత్ కుర్ర జట్టు అతిధ్య జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది. మూడు టి20ల సిరీస్‌ను 30తో జింబాబ్వేను చిత్తుచేసిన శ్రేయాస్ సేన తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో 35 పరుగులు తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష ఛేదనలో జింబాబ్వే 157 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో అతిధ్య జట్టు సొంత గడ్డపై ఘోర పరాభావాన్ని ఎదుర్కొవలసి వచ్చింది. ర్యాన్ బార్ల్(54) రాణించినా.. వెస్లీ మద్వైరా(28), కర్రన్(20), మైయ్యర్స్(19) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు టీనేజ్ స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ(81 ) శుభారంభాన్ని అందించాడు. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఇతర భారత ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నా వైభవ్ తనదైన స్టైల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసి ఉంటే టీ20 అంతర్జాతీయ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించి ఉండేవాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో తడివానషే మరుమణికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్(29), శ్రేయస్ అయ్యర్(27), తిలక్ వర్మ(11 నాటౌట్), రింకూ సింగ్(25)లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. రింకూ సింగ్ చివర్లలో 14 బంతుల్లో 25 పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా 192 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బ్లెస్సింగ్ ముజరబాని, సికందర్ రజా, వెస్లీ మాధవెరె తలో వికెట్ తీశారు.











