
హైదరాబాద్: ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి లీలలు వెలుగులోకి వచ్చాయి. గదిలో ప్రేమ లేఖలు దొరకడంతో వివాహితతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిసింది. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధించిడంతో ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను డిసిపి లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ఉదయ్ గదిని పోలీసులు తనిఖీ చేశారు. గది నుంచి ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ ఫోన్, లవ్ లెటర్స్ (ప్రేమ లేఖలు), ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. లేఖల్లోని పేర్ల గురించి ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మహిళతోనూ అతడికి సంబంధమున్నట్లు తేలింది. ఆమెకు 2014లోనే పెళ్లవగా, ఒక కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. ఆయనను మరింత విచారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కస్టడీ పిటిషన్ పై విచారణ చేయనున్నారు. ఉదయ్ ల్యాప్ టాప్, ఐ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు. మరో యువతికి కూడా పెళ్లి పేరుతో ఇన్ స్టాలో ఎరవేసినట్లు సమాచారం. మరో ఇద్దరి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. ఆర్థిక వ్యవహారం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











