చెన్నై: ఆలయ పూజారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లా తిరువందియపురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఆవణి మాస ముహూర్త సందరోభంగా ఆదివారం 84 పెళ్లిలు జరిగాయి. నాగరాజు అనే యువకుడు ఆలయంలో పూజారిగా పని చేసేవాడు. కడలూరుకు చెందిన ట్రాన్స్ జెండర్ సంజన అతడికి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు.