20వేల డాలర్ల బాండ్ సమర్పిస్తేనే వ్యాపార, పర్యాటక వీసాలు

50 దేశాలకు వర్తింపు.. భారత్‌కు మినహాయింపు

నిర్ణీత సమయంలో తిరిగి వెళ్తే మొత్తం వాపస్ 

వాషింగ్టన్: వ్యాపార, పర్యాటక వీసాల జారీకి శాశ్వత విధానాన్ని అమెరికా తీసుకువచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచంలోని 50 దేశాలకు వర్తింప చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఇకపై అమెరికాకు వ్యాపార, టూరిజం వీసాల పేరిట తాత్కాలికంగా అమెరికా వచ్చి వెళ్లే ఆయా దేశాల ప్రజలు 20వేల డాలర్లతో కూడిన బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. తాజా నిబంధనలను ఈ నెల 3 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

వ్యాపార, టూరిస్ట్ వీసాలపై వచ్చే వారు 20వేల డాలర్ల బాండ్ సమర్పించి తిరిగి నిర్దేశిత సమయంలో స్వదేశానికి వెళితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని ట్రం ప్ సర్కార్ ప్రకటించింది ఈ వీసా బాండ్‌ను ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరి కా ఖండాలకు చెందిన దేశాలకు వర్తింప చేశారు. ఈ జాబితాలో భారత్‌ను చే ర్చకపోవడం విశేషం.

ఈ పథకాన్ని తొలుత పైలట్ పథకంగా అమలు చేసిన అమెరికా అది విజయవంతం కావడంతో దానికి మరిన్ని మార్పులు చేర్పులు చేసి శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. వ్యాపార, పర్యాటక వీ సాలపై అమెరికా వచ్చి వాటి గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారని, దాన్ని అరికట్టేందుకే తాజా విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టుగా బాం డ్ నిబంధన అమలు చేసిన తర్వాత దేశంలో అక్రమంగా ఆవాసం ఉంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ముఖ్యంగా తాము గుర్తించిన దేశాల విషయంలో నిరూపితమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.