
రాజులు మారినా,రాజ్యాలు కూలినా ఆధునిక ప్రపంచంలో స్త్రీలపై హింస తప్పడంలేదు. అన్యాపదేశంగా చందాల కేశవదాసు 115 సంవత్సరాల క్రితం రాసిన కనక్తార నాటకం ఈనాటికి సజీవం. నాటి కాలమాన వైచిత్రమో, చందాల కేశవదాసు దూరదృష్టినో చెప్పలేము కానీ, ఆయన రాసిన కనక్తార నాటకం నేడు చారిత్రికప్రాదాన్యత సంతరించుకొంది. స్త్రీలపై హింస, పురుషాదిక్య సమాజం అకృత్యాలను, స్త్రీల తిరుగుబాటును కళ్ళకు కట్టినట్లు ఈ నాటకంలో చూపించడం అద్భు తం. అంతేకాదు కనక్తార నాటకంలో రచయిత తెలంగాణా యాసను, భాషను ప్రవేశపెట్టిన తొలి నాటకంగా సైతం చరిత్ర సాహిత్య పుటల్లో నిలుస్తుంది. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకానికి కాస్తా అటూ ఇటూగా1911లో కేశవదాసు ఈ నా టకం రాశారు.
అయితే కన్యాశుల్కం నాటకానికి దక్కిన ప్రాధాన్యత, ప్రాచుర్యం కనక్తార నాటకానికి లభించలేదు. అందుకు కులం అడ్డు గోడలో, ప్రాంతీయ అసమానతలో కారణం కావచ్చును. నిజానికి గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం లో వస్తువు కాలపరిమితి దాటింది. కానీ, చందాల కేశవదాసు రాసిన కనక్తార నాటకంలో స్త్రీ వివక్ష, మానవీయ విలువలు, అక్కా, తమ్ముడి అనుబం ధం సందేశం అనే వంటి అంశాలతో నేటికీ స జీవ గా నిలుస్తుంది. అంతే కాదు రచయిత కనక్తార నాటకంలో తీసుకున్నవస్తువు, ఆ స్త్రీ హింస,వివక్ష అనేవి నేటికీ మన సమాజం లో చెక్కు చెదరకుం డా ఉండడంతో పాటు అది మరింత వికృత రూ పం దాల్చింది. కనక్తార నాటకం 1911లో పద్య నాటకంగా మెదలైనా, ఆ నాటకం ఇప్పటికే 30 సార్లు పునర్ముద్రణ పొందింది. అది దాని ప్రశస్థి.
ఈ నాటకం (1937,1956) రెండు సార్లు సిని మాగా సైతం తీయబడింది. నాటకంగా సజీవత కల్పించడంలో సురభి కళాబృందం కృషి అమో ఘం. నాట కం ఇతివృత్తం రాజరిక వ్యవస్థ చుట్టూ తిరిగినప్పటికీ, ఆనాటి సామాజిక పరిస్థితులు, తెలంగాణా భాష ,యాసను ఆయన పట్టిచ్చారు. కనక్తార నాటకం ఇతివృత్తం సూరసేన మహారాజు ఆయన తమ్ముడు ఉగ్రశేనుడు చెడు వ్యసనాలకు బానిస కావడం, రాజ్యంలోని సాధారణ కుటుంబ స్త్రీలను చెరబట్టడం, ప్రశ్నించిన రాజును కు ట్రతో చంపడం, రాజు భార్యా, పిల్లలు అరణ్యం పాలవ్వడం, అష్టకష్టాలు పడిన తర్వాత తిరి గి రాజ్యం జయించడం ఇదిస్థూలంగా కథ!. చిత్రంగా ఈనాటి స్త్రీ హింస, పురుషాహకారం, వా టిపై స్త్రీల ప్రతిఘటన నాటి నాటకంలోని ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.
ఉగ్రసేనుడు మద్యంకు బానిసగా మారి సా మాన్య స్త్రీలను చెరబట్టడం, ఉగ్రసేనుడి అకృత్యాలను ప్రశ్నించినందుకు మంత్రి, సైన్యాధిపతిని, చివరకు రాజును హతమార్చడం, రాజు భార్య, ఇద్దరు పసిపిల్లలను చెరబట్టే సన్నివేశంలో స్త్రీలపై హింసను చూపిస్తాడు. ఫెమినిస్టు అనే పదం బహిర్గతం కాక ముందే, కనక్తార నాటకంలో కేశవదా సు అన్యాపదేశంగా ఫెమినిజంను డైలాగుల రూ పంలో వ్యక్తం చేశారు. ఉగ్రసేనుడు తన వదినను ఆశించిన సమయంలో, ఓ స్త్రీగా ఆత్మగవురవం, ప్రాణాలు కాపాడుకునే సన్నివేశంలో ఆమె మాట్లాడిన ఒక్కొక్క మాట సమాజంపై పేల్చిన తూటాలే అని చెప్పక తప్పదు. మహారాణి తటాకంలో దూకి ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో ఆకాశవాణి సందేశం నేటి ఆత్మహత్యలకు మేల్కొలుపు సందేశంగా చెప్పవచ్చును. తటాకం నుండి జాలర్లు ఆపదలో ఉన్న రాణిని రక్షించిన తర్వాత ఆ జాలర్ల మధ్య సంభాషణ, పురుషాహకార స్వరూపం, స్త్రీ వ్యామోహంను వారి సంభాషణ రూపంలో బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా పురుషాధిక్యత సమాజంలో ఒంటరిగా దొరికిన స్త్రీలను పురుషులు ఎలా భావిస్తారో రచయిత కళ్లకు కట్టారు.
నాటకం అద్యంతం ప్రతి డైలాగులో స్త్రీ అణచివేత రూపాలు, తిరుగుబాటు సన్నివేశాలు కనిపిస్తాయి. రాణి జాలరుల నుండి తప్పించుకుని పోవ డం, అడవిలో క్రూరమృగాలు దాడి, ఓ వ్యాపారి కాపాడి రక్షించడం, అసందర్భంగా వారిద్దరి మధ్య సన్నివేశం డైలాగులు లో కూడా స్త్రీ నిస్సహాయత, అనుమానాలు, నిస్సహాయ స్థితిలో స్త్రీలపై వేదింపులు ఎలా ఉంటా యో దృశ్య రూపంలో చూపా రు. రచయిత కేశవదాస్. చాలా చిత్రంగా, ఆధునిక కాలానికి కూ డా అందనంత స్పష్టంగా కనక్తార నాటకంలో చందాల కేశవదాసు స్త్రీలపై హింసా కోణాల్ని అద్బుతంగా రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే కనక్తార నాటకం తెలుగు భాషలో, తెలంగాణా యాసలో వచ్చిన తొలిఫెమినిస్టు నాటకంగా చూడవచ్చును.
ఇన్నేళ్ళుగా కనక్తార నాటకంలోని గొప్పతనం గుర్తించకపోవడం, మన సాహిత్య అవిటితనమే! ఇప్పటికైనా చందాల కేశవదాసు లాంటి గొప్ప రచయితలను వెలుగులోకి తేవడం తోపాటు, ఆయన రచనలు, సినిమాలపై చర్చ జరగాలి. కేశవదాస్ కుటుంబం, ఇన్నాళ్ళు కనక్తార నాటకం ప్రజల్లో నిలబెట్టిన సురభి కళాబృందాలకు సముచిత గౌర వం ఇవ్వాలి. చందాల కేశవదాసు రచనలను, ఆయన చరిత్రను యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం మాత్రం ఉంది.
కనక్తార నాటకం కాలాన్ని జయించిన నాటకం. ఈ నాటకం చందాల కేశవదాసును తొలి సినీ గే య రచయితనే కాక, తెలంగాణా యాస, భాషను తొలిసారి నాటకంలో ప్రవేశపెట్టిన ఖ్యాతి తోపా టు, ఫెమినిస్టులో చూపుతో రాసిన తొలి నాటకం గా సై తం చరిత్ర కెక్కింది. తెలుగు దృశ్య రూపాల్లో కనక్తార సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అజరామ రం. చందాల కేశవదాసుకు తొలితరం సంఘసం స్కర్తల వరుసలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.

- ఎన్.తిర్మల్








