చెన్నై: తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో డిఎంకె నేత ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. కావేరి నీళ్లు చేరాల్సిన చోటికి చేరుతున్నాయని సిఎం విజయ్, సినీ నటి త్రిషపై అసభ్యకర కామెంట్లు చేశారని ప్రతిపక్ష నేత ఉదయనిధిపై టివికె కార్యకర్త తంజావూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఉదయనిధి సభలో మాట్లాడుతుండగా త్రిష..త్రిష.. అని డిఎంకె కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోందని, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టు ఒక జోక్ లా ఉందని, తాను ఏమైనా తప్పుగా మట్లాడితే కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన అరెస్టుపై చట్టపరంగా పోరాడుతానని ఉదయనిధి సవాల్ విసిరారు.