వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై సిఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఆనాడు ఉద్యమంలో రాజకీయనేతల బలిదానాలు లేవని.. కానీ, విద్యార్థులు బలిదానాలు చేశారని అన్నారు.

"చదువే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. చదువే మన భవిష్యత్తు. ఆనాడు అంగన్‌వాడి నుంచి యూనివర్సిటీల వరకూ ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే జరిగింది" అని రేవంత్ అన్నారు. అంతకుముందు సిఎం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా దివిటిపల్లి అమర రాజా గిగా కారిడార్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు.