ఉత్తర్ ప్రదేశ్  లోని ఖుషీ నగర్‌లో జరిగిన ఓ ప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి చనిపోయారు. కారు ఢీకొన్న వేగానికి వారంతా 10మీటర్లు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ముక్కలు ముక్కలైన బైక్ ఏకంగా 20మీటర్ల దూరంలో పడ్డారు.