హైదరాబాద్: సామాన్యులకు ఖరీదైన వైద్యం అందించాలన్న తమ సంకల్పం నెరవేరిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 90 శాతానికి పైగా సర్జరీలు ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ ద్వారా జరిగాయని తెలియజేశారు. వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని రేవంత్ రెడ్డి కోరారు. రోబోటిక్ సర్జరీల్లో నిమ్స్ వైద్యులు ఘనత సాధించారు. నిమ్స్ వైద్యులు మూడేళ్లలోనే దాదాపు 90 శాతం రోబోటిక్ సర్జరీలు ఉచితంగా చేశారు. నిమ్స్ వైద్యులను రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.