
మన తెలంగాణ/మియాపూర్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 డిసెంబర్ లో సంచలనం సృష్టించిన యువతి తల్లి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ లోని 12వ అదపపు జిల్లా సెషన్స్ కోర్డు గురువారం తీర్పు వెలువరించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 1582/2022 గా నమోదైన ఈ కేసులో నిందితుగు ఎద్దు సందీప్ కుమార్ అలియాస్ బబ్లూను కోర్డు దోషిగా నిర్ధారించింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఎద్దు సందీప్ కుమార్ అదే జిల్లా కు చెందిన వైభవికి 2018 లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత యువతిపై అనుమానం పెంచుకున్న నిందుతుడు తరచూ వేదించడంతో ఆతన్ని దూరం పెట్టింది. అప్పటినుండి యువతి సందీప్ వేరువేరు నెంబర్ల నుండి ఫోన్ చేస్తూ మానసికంగా వేధించాడు.
ఈ నేపథ్యంలో 2022 మే నెలలో వైభవ తన తల్లి శోభ, సోదరుడితో కలిసి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో నివాసముంటుంది. 2022 డిసెంబర్ 13 వ తేది ఉదయం 10.30 గంటల సమయంలో సందీప్ యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని, తల్లిని అతిదారుణంగా పొడిచి తాను గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి తల్లి శోభ చికిత్స పొందుతూ మృతి చెందగా యువతి వైభవి ప్రాణాపాయం నుండి బయటపడింది. అనంతరం మియాపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలతో సేకరించి చార్జిషిట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ అనంరతం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయలు జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చింది.











