జంతర్ మంతర్ వద్ద పరిస్థితి అదుపుతప్పుతున్నందునే లాఠీచార్జి

విద్యార్థులను రెచ్చగొట్టి కొన్ని పార్టీల రాజకీయ లబ్ధి

త్వరలో బయటికి విచ్ఛిన్నరకర శక్తుల వివరాలు

ఎంపిలు కొండా, అరుణ సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః  విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బిజెపి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో జరిగినట్లు విదేశాల్లో ఎవరైనా చేస్తే పోలీసులు కాల్చి వేస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి పోలీసులు కేవలం లాఠీలకే పని చెప్పారని ఆయన అన్నారు. జంతర్-మంతర్ వద్ద పరిస్థితి అదుపు తప్పుతున్నందునే పోలీసులు లాఠీ ఛార్జి చేశారని ఆయన తెలిపారు. సిజెపికి విదేశీ నిధులు అందాయన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఎంపీ అరుణ మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనల వెనుక విచ్ఛిన్నకర శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. ఆ శక్తుల వివరాలూ త్వరలో బయటకు వస్తాయని ఆమె హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులు ధర్నా చేస్తే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో గ్రూపు- పరీక్షా పత్రం లీకైతే ఎవరు రాజీనామా చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ పదవ తరగతి పరీక్షా పత్రం లీక్ అయితే ఎవరు రాజీనామా చేశారని ప్రశ్నించారు. సరైన సమయంలో ప్రజలు ఈ పార్టీలకు గుణపాఠం చెబుతారని ఎంపీ అరుణ హెచ్చరించారు.

--++--