మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ ఉ ద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామని, అన్ని విద్యుత్ సంస్థల్లో ప్ర మోషన్ల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసే లా చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ హామీ ఇ చ్చారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ (టిఇఇజెఏసి) ప్రతినిధులు గురువారం ఆయనను కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వి వరించారు. ప్రధానంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సిన పిఆర్‌సి కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇపిఎఫ్ నుంచి జి పిఎఫ్‌కు మార్పు అంశాన్ని పరిష్కరించాలని జెఏసి ప్రతినిధులు కోరారు. పదవీ విరమణ చేసిన ఇపిఎఫ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ ప్ర మోషన్లను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశా రు. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చేయడంతోపాటు కొత్త నియామకాలను వేగవంతం చేయాలని కోరారు. సిబ్బం ది కొరతతో ప్రస్తుత ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని,

దీనివల్ల వినియోగదారులకు అందించే సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని జెఏసి నేతలు వివరించారు. ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల బ దిలీల అంశాలను కూడా నవీన్ మిట్టల్ దృష్టి కి తీసుకెళ్లారు. జెఏసి ప్రస్తావించిన అంశాలపై నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సంబంధిత శాఖలు, విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు డిస్కం విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే నాలుగు విద్యు త్ సంస్థల్లో బదిలీలు చేపట్టేలా చూస్తామని, విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆర్‌పిడిసిఎల్ విషయంలో సంఘాల తో ట్రైపార్టైట్ ఒప్పందం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిఆర్‌సి అంశంపై ఉప ముఖ్యమంత్రితో చర్చించి త గిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జెఏసి చైర్మన్ సిహెచ్. రమేశ్, కో-చైర్మన్ పి.అంజయ్య, కన్వీనర్ ఎన్.శివా జీ, కో-కన్వీనర్ నాసర్ షరీఫ్‌తో, నాయకులు అక్బర్, కరెంట్‌రావు, రాజా రవిచంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.