భారత క్రికెటర్ అభిషేక్ శర్మ పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే మ్యాచ్‌లో అదరిపోయే ప్రదర్శన చేశాడు. అమృత్‌సర్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ (233, 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 533 పరుగులు చేసింది.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో అభిషేక్ ఆశించిన మేరకు రాణించలేదు. జింబాబ్వేతో జరిగిన మూడు టి-20ల సిరీస్‌లో కేవలం 11 పరుగులే చేశాడు. అంతకు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతడు తన 10 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే చేశాడు.