
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఎవరితో పెట్టుకోవద్దో వారితో పెట్టుకున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొత్తతరానికి సమాజంపై ఎక్కువగా కమిట్ మెంట్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందని కొనియాడారు. స్వేఛ్చకు పరిమితులు ఉండకూడదని సూచించారు. సోషల్ మీడియా లేకపోతే జవాబుదారీతనం వచ్చేది కాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే ఔట్ డేట్ అయిపోతామని కెటిఆర్ హెచ్చరించారు.
దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎవరో ఒకరికి వత్తాసు పలుకుతున్నాయని, వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదని విమర్శించారు. కేంద్రమంత్రి తనయుడి లైంగిక దాడిని ఏ మీడియా కవర్ చేయలేదని, లగచర్ల దాడిలో రైతులపై కేసులు పెడితే ఏ మీడియా రాయలేదని మండిపడ్డారు. వాట్సాప్ అంకుల్స్.. ఇన్ స్టా పిల్లల్లో ఎవరూ గెలిచారో చూశామని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం పైగా జెన్ జి ఓట్లు వేయబోతున్నారని అన్నారు. తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి దేశంలో ఉందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.










