
5233 articles
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీ తాగుతున్న యువతులపై ఓ అల్లరిమూక దాడి చేసింది.వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నెహ్రూ ప్లేస్‌లోని ఓ టీ షాప్ దగ్గర ఇద్దరు యువతులు టీ తాగుతున్నారు. అటు వైపు వెళుతున్న యువకుల గ్యాంగ్ టీ తాగుతున్న యువతులపై […] The post ఢిల్లీలో దారుణం..యువతులపై అల్లరిమూక దాడి appeared first on Navatelangana.

ఖమ్మం: ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనమైన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా సమీపంలో జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. లారీ క్యాబిన్లు నుజ్జునుజ్జుగా మారాయి. పోలీసులు మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
– నలుగురి పరిస్థితి విషమంనవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై శంషల్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక బీదర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు […] The post జహీరాబాద్ బార్డర్ లో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: అన్నాడిఎంకె లో చీలికలేర్పడ్డాయి.. రాజ్యసభ ఎంపి సీవీ షణ్ముగమ్ నేతృత్వంలో కొందరు నేతలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి, సిఎం విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తగ్గట్టే అన్నాడీఎంకే లో చీలికలేర్పడి వారు సిఎం విజయ్ కు మద్దతు ప్రకటించారు. The post అన్నాడీఎంకెలో చీలిక..సీఎం విజయ్‌కు మద్దతు appeared first on Navatelangana.





హైదరాబాద్: మే 3వ తేదీన జరిగిన నీట్ 2026 పరీక్షను రద్దు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతోనే నీట్ పరీక్షను రద్దు చేసినట్లు సమాచారం. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ ఎగ్జామ్ కు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశం మీద సిబిఐ విచారణ జరిపిస్తామని, కేంద్రం తదుపరి ఆదేశాలు ఇచ్చిన తరువాత ఎలాంటి ఫీజు లేకుండా మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్ టిఎ తెలిపింది. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతారని తెలిసినా కూడా రాజీపడితేనే ఈ వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం జరగదని ఎన్‌టిఎ తెలిపింది. త్వరలోనే రీఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పరీక్షా కేంద్రాల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేసింది. అదనంగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, చెల్లించిన ఫీజును కూడా రీఫండ్ చేస్తామని ఎన్‌టిఎ తెలియజేసింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, త్వరలో కొత్త అడ్మిట్ కార్డులను ఇస్తామని తెలిపిం


బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్-జహీరాబాద్ రోడ్డుపై అదుపుతప్పిన కర్ణాటక ఆర్టీసీ బస్సు.. బైక్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు సంగారెడ్డి జిల్లా నాల్కల్ కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు.. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




అమరావతి: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం అమలు చేయనున్నామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరగనుందని, డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ తర్వాత 24 గంటల్లో ఆమోదం పొందనుందని, శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జరరేషన్ 24 గంటల్లో పూర్తికానుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు అని వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం అని మండిపల్లి తెలియజేశారు. సెలవు రోజుల్లో కూడా ఆన్ లైన్ ద్వారా ఆమోదం ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడుతున్నామని, ప్రజలకు పారదర్శక, సులభ సేవల దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.



హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో ఓ కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. మాధవ్ తీవారి నాలుగు ఓవర్ల బౌలింగ్ చేసి రెండు మెయిన్ వికెట్లు పడగొట్టాడు. చివరలో బ్యాటింగ్ కు దిగిన మాధవ్ ఎనిమిది బంతుల్లో 18 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించినందకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ జట్టులో ఆటగాడిగా అవకాశం ఇచ్చినందుకు జట్టు మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పాడు. బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ సర్ తో బౌలింగ్ చేయడంలో చాలా కష్టపడ్డానని, ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో మెరుగుపరుచుకోవడమే తన లక్ష్యామన్నారు. తాను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం అద్భుతంగా ఉందని, ఈ వికెట్‌పై లెంగ్త్ బంతులు వేయడంతో పాటు వైడ్ బాల్స్, షార్ట్ బాల్స్ వేశానని వివరించాడు. రెండో ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇస్తే




