
5215 articles
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్‌లో పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా ఈనెల 3న నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలోని శాస్త్రీ భవన్ ఎదుట NSUI విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను బారికేడ్లలతో అడ్డగించారు. అదే విధంగా నీట్ పరీక్ష రద్దుపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. […] The post నీట్ పరీక్ష రద్దు..ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు appeared first on Navatelangana.

భువనేశ్వర్: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారా వెటర్నరీ కాలేజీ మైదానంలో బిశ్వశర్మతో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్ సిఎం సువేందు అధికారి, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత రికార్డు సృష్టించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 82 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జులుక్బారి నియోజకవర్గం నుంచి హిమంత శర్మ 89 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

హైదరాబాద్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకూడదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎం వీడియోకాన్ఫరెన్స్ జరిపారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చూడాలని, లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని రేవంత్ సూచించారు. అధికారులు కొనుగోళ్ల తీరును పరిశీలించాలని, గన్నీబ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. రైతులకు వాతావరణ సూచనలు చేరవేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

పెషావర్: పాకిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. వాయువ్య పాకిస్థాన్‌లో మంగళవారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని లక్కీ మార్వత్ జిల్లాలో ఓ దుండగుడు పేలుడు పదార్థాలతో వాహనంతో సహా పేల్చుకోవడంతో ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. జిల్లా పోలీసు అధికారి ప్రకారం.. దుండగుడు పేలుడు పదార్థాలతో నింపిన ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ.. రద్దీగా ఉండే నౌరంగ్ బజార్ ప్రాంతంలోని ఫట్టక్ చౌక్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. మృతులలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఒక మహిళ ఉన్నారని, డజన్ల కొద్దీ గాయపడిన బాధితులను సరాయ్ నౌరంగ్‌లోని తహసీల్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు.

ధర్మశాల: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బిసిసిఐ షాకిచ్చింది. సోమవారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆనందంలో ఉన్న అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్-రేట్ కారణంగా ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం అక్షర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపిఎల్ 2026 సీజన్ లో స్లో ఓవర్-రేట్ సమస్యలు పదేపదే చర్చనీయాంశంగా మారాయి. ఈ సీజన్‌లో పలువురు కెప్టెన్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు.కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ నిర్దేశించిన 211 పగరుల లక్ష్య ఛేదనలో మొదట తడబడిన ఢిల్లీ.. తర్వాత పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 216 పరుగుల చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లలో అశుతోష్(24), మధవ్(18 నాటౌట్), అకిబ్(10 నాటౌట్) మెరుపులు మెరించడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే మూడు వికెట్ల తేడాతో గెలుపొందిం
నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో, ఆయన వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. The post హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీ తాగుతున్న యువతులపై ఓ అల్లరిమూక దాడి చేసింది.వారి దుస్తులు చింపి, అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నెహ్రూ ప్లేస్‌లోని ఓ టీ షాప్ దగ్గర ఇద్దరు యువతులు టీ తాగుతున్నారు. అటు వైపు వెళుతున్న యువకుల గ్యాంగ్ టీ తాగుతున్న యువతులపై […] The post ఢిల్లీలో దారుణం..యువతులపై అల్లరిమూక దాడి appeared first on Navatelangana.

ఖమ్మం: ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనమైన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా సమీపంలో జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. లారీ క్యాబిన్లు నుజ్జునుజ్జుగా మారాయి. పోలీసులు మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
– నలుగురి పరిస్థితి విషమంనవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై శంషల్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక బీదర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు […] The post జహీరాబాద్ బార్డర్ లో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: అన్నాడిఎంకె లో చీలికలేర్పడ్డాయి.. రాజ్యసభ ఎంపి సీవీ షణ్ముగమ్ నేతృత్వంలో కొందరు నేతలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి, సిఎం విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తగ్గట్టే అన్నాడీఎంకే లో చీలికలేర్పడి వారు సిఎం విజయ్ కు మద్దతు ప్రకటించారు. The post అన్నాడీఎంకెలో చీలిక..సీఎం విజయ్‌కు మద్దతు appeared first on Navatelangana.





హైదరాబాద్: మే 3వ తేదీన జరిగిన నీట్ 2026 పరీక్షను రద్దు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతోనే నీట్ పరీక్షను రద్దు చేసినట్లు సమాచారం. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ ఎగ్జామ్ కు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశం మీద సిబిఐ విచారణ జరిపిస్తామని, కేంద్రం తదుపరి ఆదేశాలు ఇచ్చిన తరువాత ఎలాంటి ఫీజు లేకుండా మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్ టిఎ తెలిపింది. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతారని తెలిసినా కూడా రాజీపడితేనే ఈ వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం జరగదని ఎన్‌టిఎ తెలిపింది. త్వరలోనే రీఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పరీక్షా కేంద్రాల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేసింది. అదనంగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, చెల్లించిన ఫీజును కూడా రీఫండ్ చేస్తామని ఎన్‌టిఎ తెలియజేసింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, త్వరలో కొత్త అడ్మిట్ కార్డులను ఇస్తామని తెలిపిం


బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్-జహీరాబాద్ రోడ్డుపై అదుపుతప్పిన కర్ణాటక ఆర్టీసీ బస్సు.. బైక్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు సంగారెడ్డి జిల్లా నాల్కల్ కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు.. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




అమరావతి: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం అమలు చేయనున్నామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరగనుందని, డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ తర్వాత 24 గంటల్లో ఆమోదం పొందనుందని, శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జరరేషన్ 24 గంటల్లో పూర్తికానుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు అని వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం అని మండిపల్లి తెలియజేశారు. సెలవు రోజుల్లో కూడా ఆన్ లైన్ ద్వారా ఆమోదం ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడుతున్నామని, ప్రజలకు పారదర్శక, సులభ సేవల దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

