‘Epic – First Semester’ ఒక పాసబుల్ లవ్ డ్రామా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. హేషమ్ మ్యూజిక్ కూడా సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే రిపిటేటివ్ రైటింగ్, నెమ్మదైన నేరేషన్, కథలో తగినంత ప్రోగ్రెషన్ లేకపోవడం మైనస్. చివర్లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకున్నా.. అప్పటికే సినిమా కొంత ఓపికను పరీక్షిస్తుంది. ఓవరాల్‌గా.. కొన్ని మంచి మూమెంట్స్ కోసం నెమ్మదైన కథనాన్ని భరించగలిగితే ‘Epic – First Semester’ను ఒకసారి చూడొచ్చు. అంచనాలు మాత్రం కాస్త తగ్గించుకుని వెళ్లడం మంచిది.