2007లో విడుదలైన అమీర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం తారే జమీన్ పర్లో యోహాన్ అవస్థీ పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన బాలనటుడు సచేత్ ఇంజనీర్ ప్రస్తుతం పూర్తిగా భిన్నమైన రంగంలో రాణిస్తున్నాడు. సినీ రంగాన్ని కొనసాగించకుండా చదువులపై దృష్టి పెట్టిన సచేత్, ప్రస్తుతం యూకేలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

అంతేకాకుండా, తన చిన్ననాటి కల అయిన పైలట్ కావాలనే లక్ష్యంతో విమానయాన శిక్షణ కూడా పొందుతున్నాడు. ఇటీవల ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో బాలనటుడిగా గుర్తింపు పొందిన సచేత్, నేడు వైద్య రంగంలో విజయవంతంగా నిలవడం పలువురికి స్ఫూర్తిగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తారే జమీన్ పర్ సినిమా, అందులోని పాత్రలు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నాయి.