టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ కాంబినేషన్.. ఆ తర్వాత మంచి అనుబంధానికి కేరాఫ్‌గా మారింది.
తాజాగా విజయ్ దేవరకొండ తన అభిమాన దర్శకుడికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సందీప్ రెడ్డి వంగా కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చారు.
ఈ సందర్భంగా సందీప్ వంగాకు విజయ్ దేవరకొండ ఓ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా అందించారు. విజయ్ ప్రేమగా ఇచ్చిన బహుమతిని సందీప్ వెంటనే చేతికి ధరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన అభిమానులు “కొండన్న మనసు బంగారం” అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు.. విజయ్, సందీప్ కాంబినేషన్‌లో మరోసారి సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














