మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. సౌత్ తో పాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది.
అయితే తమన్నా కాళ్లు పట్టుకుంటా అంటూ ఓ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్.
అన్నూ కపూర్ ఓ ఇంటర్వ్యూలో స్త్రీ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ..తమన్నా చాలా తెల్లగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దాంతో తమన్నా ఫ్యాన్స్ అన్నూ కపూర్ పై సీరియస్ అయ్యారు. ఒక అమ్మాయి అందాన్ని రంగుతో పోల్చుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నూ కపూర్ ను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాంతో ఈ వివాదం పై అన్నూ కపూర్ స్పందిస్తూ.. హిందీలో అనడం వల్లే నేనన్న మాట వాళ్లకి వల్గర్‌గా అనిపించిందని, ఒకరి అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదని, క్రైమ్ అంతకన్నా కాదని, తన మనసులో అసలు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేదని తెలిపారు. అలాగే తన మాటలు తమన్నాకు బాధ కలిగించి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని తెలిపాడు. దీంతో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు..













