దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది త్రిష. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే అప్పట్లో ఓ తోపు హీరోయిన్ తో త్రిషకు మనస్పర్థలు ఉన్నాయని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆసిన్. వీరిద్దరి మధ్య విజయ్ కారణంగా మనస్పర్థలు వచ్చాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

అయితే ఈ విషయంపై గతంలోనే త్రిష స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆసిన్ తో మనస్పర్థల గురించి ప్రశ్న ఎదురు కావడంతో త్రిష స్పష్టత ఇచ్చారు. అందులో త్రిష మాట్లాడుతూ.. “నాకు, నటి అసిన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయన్నది పూర్తిగా వదంతులే. నటి అసిన్‌తోనే కాదు, నాకు మరే ఇతర నటితోనూ ఎప్పుడూ విభేదాలు లేవు. నేను ‘వర్షం’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాను. ఆ కార్యక్రమంలోనే నేను అసిన్‌ను కలిశాను. అప్పుడు ఆమె నన్ను అభినందించారు. నాకు, ఆమెకు మధ్య ఎప్పుడూ గొడవ జరగలేదు,” అని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.