అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజ ప్రయోజనాల కోసం నిరంతరం సేవలందిస్తున్న అమెరికా తెలుగు సంఘం (ATA) మరోసారి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక కార్యక్రమాన్ని ప్రకటించింది. హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “SAT Prep Coaching Program 2026”కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు ATA ప్రకటించింది. అమెరికాలో ఉన్నత విద్యా అవకాశాలకు కీలకమైన SAT పరీక్షలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ కోచింగ్ ఉపయోగపడనుంది.
SAT కోచింగ్ రంగంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ప్రొఫెషనల్ ట్యూటర్లు ఈ శిక్షణను అందించనున్నారు. విద్యార్థుల నైపుణ్య స్థాయిని బట్టి బిగినర్, అడ్వాన్స్‌డ్ విభాగాలుగా తరగతులు నిర్వహించబడతాయి. ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం 2026 జూన్ 6 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతి వారాంతంలో (శని, ఆదివారాలు) కొనసాగుతుంది.
క్లాస్ టైమింగ్స్
బిగినర్ క్లాస్: మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు (EST)
అడ్వాన్స్‌డ్ క్లాస్: సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 6:30 గంటల వరకు (EST)
ఫీజు వివరాలు
ATA సభ్యుల కోసం ఒక్కో విద్యార్థికి కోచింగ్ ఫీజు 200 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ విధానం
SAT కోచింగ్‌లో చేరదలచిన వారు ముందుగా ATA సభ్యత్వం పొందాలి. సభ్యత్వం లేని వారు ATA Membership లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అనంతరం SAT Payment లింక్ ద్వారా ఫీజు చెల్లించి తమ సీటును ఖరారు చేసుకోవాలి.
ఫీజు చెల్లించే సమయంలో కామెంట్స్ సెక్షన్‌లో ఈ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులు సూచించారు:
*విద్యార్థి పేరు
*ఈమెయిల్ ఐడీ
*గ్రేడ్
ట్రాక్ లెవెల్ (Beginner / Advanced)
రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే ఒక రోజు ముందే ఆన్‌లైన్ క్లాస్ లింకులు ఈమెయిల్ ద్వారా పంపబడతాయి.
మునుపటి బ్యాచ్‌లలో పాల్గొన్న విద్యార్థులు SAT, ACT పరీక్షల్లో అత్యుత్తమ స్కోర్లు సాధించారని ATA ప్రతినిధులు తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి ఉన్న విద్యార్థులు వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని స్టూడెంట్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ నరసింహ చిట్టాలూరి, సభ్యులు శిరీష బుర్ర, రవీందర్ దాసరపు, వరుణ్ కంచర్ల మరియు సలహాదారు బాలకిషన్ కొంపెల్లి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ఈ కార్యక్రమం ప్రవాస తెలుగు సమాజంలో విశేష స్పందన పొందుతోంది.
















