అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డిని ATA ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ATA ప్రతినిధులు మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు, ప్రవాస తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.