అమెరికాలోని తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA లాస్‌వెగాస్ చాప్టర్‌ 2027-2030 కాలానికి కొత్త నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. లాస్‌వెగాస్ చాప్టర్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ పోటు బాధ్యతలు చేపట్టనున్నారు. ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం కలిగిన ఆయన సమాజ సేవకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

ఈ కొత్త కమిటీలో అనిల్ చౌదరి పెంట్రాలా ట్రెజరర్ & సెక్రటరీగా, స్వప్న ఉప్పలపాటి మహిళా సాధికారత & కమ్యూనిటీ అవుట్‌రీచ్ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. అలాగే రాకేష్ కుమార్ బచ్చు కమ్యూనిటీ సర్వీసెస్ & మెంబర్షిప్ కోఆర్డినేటర్‌గా, అంజనేయులు యర్లగడ్డ బిజినెస్ & స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్స్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మాధవి దేవిరెడ్డి కల్చరల్ & కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్‌గా, కిషోర్ కొండా చిడెల్లా ఎడ్యుకేషన్ & అకడమిక్ అవుట్‌రీచ్ కోఆర్డినేటర్‌గా ఎంపికయ్యారు. యువత కార్యక్రమాల బాధ్యతలను రామకేశవ రెడ్డి కుమ్మితి నిర్వహించనున్నారు.

“సంస్కృతి మా మూలం” అనే నినాదంతో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోంది. కొత్త నాయకత్వ బృందం లాస్‌వెగాస్‌లో తెలుగు సమాజ అభివృద్ధికి మరింత సేవ చేస్తుందని సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

1000220557.jpg